తాను మరణించి... ఐదుగురికి ప్రాణం పోసి.

తాను మరణించి... ఐదుగురికి ప్రాణం పోసి.
  • నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన డాక్టర్ భూమిక
  • భూమికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు ధ్రువీకరించిన వైద్యులు
  • అవయవదానంకు ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
  • భూమిక కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ప్రశంసించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ నంగి భూమిక బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. కన్న కుమార్తెను కోల్పోయిన దుఃఖంలోనూ, అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.  

వివరాల్లోకి వెళితే, ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ నంగి భూమిక ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.